పెళ్లి సంబంధం చూస్తున్నారని గుండు చేయించుకున్న యువతి, వీడియో
ఓ యువతి గుండు చేయించుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ యువతి గుడిలో తలనీలాలు ఇస్తూ కనబడుతోంది. ఇన్‌స్టాగ్రాంలో తనకు సంబంధించిన ఈ వీడియో పోస్ట్ చేసి.... మా అమ్మ నాకు పెళ్లి సంబంధం చూస్తోంది అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. ఈ ట్యాగ్ లైన్ చూసిన నెటిజన్లు... ఇదేదో ఆమెకి ఇష్టం లేని పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నారనీ, అందుకే ఆమె అలా గుండు చేయించుకుంటోందంటూ వ్యాఖ్యలు జోడిస్తూ దాన్ని వైరల్ చేసారు. వీడియో కింద కామెంట్లు చూసిన యువతి కీర్తనా మీనన్ షాక్ తిన్నానంటూ మరో వివరణ ఇచ్చింది.
తనకు ఇష్టం లేని పెళ్లి ఏమీ జరగడం లేదని పేర్కొంది. అది కేవలం ట్యాగ్ లైన్ కోసం పెట్టాననీ, ఆ వీడియో ఇంతగా వైరల్ అవుతుందని తను అనుకోలేదని వెల్లడించింది. మగపిల్లలు గుండు చేయించుకుంటే ఏమీ పట్టించుకోరు కానీ ఆడపిల్ల గుండు చేయించుకుంటే దాని గురించి ఎందుకు అంతగా చర్చించుకుంటారో నాకు తెలియడంలేదు అంటూ పేర్కొంది. ఈ వ్యవహారం గురించి మొత్తం తన యూ ట్యూబ్ పేజీలో లెంగ్తీ వీడియోలో వివరణ ఇవ్వబోతున్నట్లు తెలిపింది కీర్తన.
