విభిన్నమైన ఆలోచనతో స్టార్ మా సూపర్ సింగర్
Star ma super singer
మాటల సెలయేరు, హావభావాల పూలతేరు శ్రీముఖి ఈ షో ని ప్రెజెంట్ చేస్తున్నారు. నలుగురు విభిన్నమైన ప్రతిభ గల న్యాయమూర్తులు ఈ సారి కంటెస్టెంట్స్ ని తీర్చిదిద్దడమే కాదు.. వారి పాటల పాటవాన్ని నిర్ణయించబోతున్నారు. పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. కమ్మని బాణీకి తన తియ్యని స్వరాన్ని చేర్చి పాటని అందమైన అనుభవంగా తీర్చిదిద్దే గాయని శ్వేతా మోహన్ ; జానపదాన్ని, సినిమా గీతాన్ని సమంగా తన విలక్షణమైన గొంతుతో పలికించి గుండెల్ని ఊయలలూగిస్తున్న మంగ్లీ ; అకాడెమి అవార్డుల వేదిక పైన తన బలమైన వినూత్న స్వరాన్ని వినిపించిన యువ స్వరం రాహుల్ సిప్లిగంజ్; అందమైన సాహిత్య స్పర్శ తో సందర్భానికి సముచితమైన, ఘనమైన స్థానాన్ని ఇచ్చే గేయ రచయిత అనంత శ్రీరామ్ - ఈ సారి న్యాయ నిర్ణేతలు.
20 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం కాబోతున్న ఈ షో లో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించబోతోంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఇంటరెస్టింగ్ గా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే స్టార్ మా లో సూపర్ సింగర్ చూడాల్సిందే. తప్పక చూడండి - “స్టార్ మా” లో సూపర్ సింగర్.
తర్వాతి కథనం
