సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (17:36 IST)

బిగ్ బాస్ ఆఫర్ చేసిన డబ్బును తీసుకోలేదు.. ఎందుకంటే..: ప్రియాంక

priyanka bigboss
బిగ్ బాస్ 7వ సీజన్ పోటీలు తాజాగా ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. రన్నర్‌రప్‌గ్ అమర్ దీప్ ఎంపికయ్యారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొని టాప్-5 కంటెస్టెంట్‌గా నిలిచిన ప్రియాంక తాజాగా మాట్లాడుతూ, బిగ్ బాస్ ఆఫర్ చేసిన డబ్బును తాను తీసుకోలేదని చెప్పారు. ఎందుకంటే తనపై ఆడియన్స్ నమ్మకం పెట్టుకుని అక్కడి వరకూ తీసుకొచ్చారు. అందుకే అలా చేయాలనిపించలేదన్నారు. కష్టపడి సంపాదించి మా తల్లిదండ్రులకు ఇల్లు కొనిపెడతానని, ఆ నమ్మకం, విశ్వాసం తనకు ఉందని చెప్పారు. 
 
హౌస్‌లో నాకు నచ్చని విషయాలను చెబుతూ వచ్చాను. తనకు తప్పు అనిపించింది చెబుతూ వచ్చానని వెల్లడించారు. టాప్-5 వరకూ రావడం గొప్ప విషయంగానే తాను భావిస్తానని చెప్పారు. అందుకే ఆ సమయంలో బిగ్ బాస్ ఆఫర్ చేసిన డబ్బును తాను తీసుకోలేదని చెప్పారు. 
 
కాగా, ప్రియాంక బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఆమె మిగతా సభ్యులకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. చాలామంది పోటీదారులను తట్టుకుని నిలబడింది. అమర్.. శోభలు తనకు ఎప్పటి నుంచో మంచి స్నేహితులని చెప్పారు. అందుకే వాళ్లతో కాస్త చనువుగా ఉన్నట్టు చెప్పారు. పైగా, తాను ఎవరి సాయం ఆశించకుండా తన శక్తిమేరకు ఆడినట్టు వెల్లడించారు.