శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (12:50 IST)

హనీమూన్ ఎక్సప్రెస్ చిత్రం పోస్టర్ విడుదల చేసిన మన్మధుడు

Nagarjuna launched Honeymoon Express PosterNagarjuna launched Honeymoon Express Poster
Nagarjuna launched Honeymoon Express Poster
చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్ గా నటించిన చిత్రం "హనీమూన్ ఎక్సప్రెస్". తనికెళ్ల భరణి మరియు సుహాసిని ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని రచయత దర్శకుడు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా కె కె ఆర్ మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ ని నిర్మించారు.
 
బిగ్ బాస్ సెట్ లో ప్రత్యేకమైన "కింగ్" రూమ్ లో 'హనీమూన్ ఎక్సప్రెస్' చిత్రం మొదటి పోస్టర్ ను కింగ్ నాగార్జున విడుదల చేసారు.
 
అనంతరం అక్కినేని నాగార్జున మాట్లాడుతూ "దర్శకుడు బాల నాకు సుపరిచితుడు. అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి డీన్ గా వ్యవహరించి, హాలీవుడ్ సినీ నిర్మాణ పరిజ్ఞానాన్ని మా విద్యార్థులకు పంచి ఇచ్చారు. అంతేకాక, మా విద్యార్థులకు, అధ్యాపకులకు 'హనీమూన్ ఎక్సప్రెస్' చిత్రం లో అవకాశాలు ఇచ్చాడు. ఈ చిత్ర కథ వినోదాత్మకంగా సమాజానికి చక్కని సందేశం కలిగి ఉంది. కళ్యాణి మాలిక్ గారి పాటలు అద్భుతంగా రొమాంటిక్ గా వచ్చాయి. ఈ చిత్రం తప్పకుండా విజయం సాదించాలి" అని కోరుకున్నారు.
 
దర్శకుడు బాల రాజశేఖరుని మాట్లాడుతూ "నేను లాస్ ఏంజెల్స్ లో ఉంటూ ఎన్నో హాలీవుడ్ చిత్రాలకి పని చేశాను కానీ తెలుగు సినిమా చేయాలి అనేది నా కల. శ్రీమతి అక్కినేని అమల గారి ప్రోద్భలంతో ఇండియా తిరిగివచ్చి అమల గారు మరియు నాగార్జున గారి ప్రోత్సాహంతో టాలీవుడ్ లో అరంగేట్రం చేశాను. నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ నా చిత్రం యొక్క మొదటి పోస్టర్ ను విడుదల చేసిన కింగ్ నాగార్జున గారికి నా కృతజ్ఞతలు .
 
'హనీమూన్ ఎక్సప్రెస్' ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. చైతన్య రావు, హెబ్బా పటేల్ అద్భుతంగా నటించారు. తనికెళ్ల భరణి మరియు సుహాసిని గార్ల క్యారెక్టర్లు మా చిత్రానికి హైలైట్ గా ఉంటాయి. యూత్ కి, ప్రేమికుల కి మా చిత్రం అద్భుతంగా నచ్చుతుంది. త్వరలో రిలీజ్ వివరాలతో మీ ముందుకు వస్తాం" అని తెలిపారు.
 సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)