సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (16:46 IST)

టీజర్ కోసం నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు ; డైరెక్టర్ తరుణ్ భాస్కర్

Tarun bhasakr with parijata team
Tarun bhasakr with parijata team
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ కి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘పారిజాత పర్వం’ కాన్సప్ట్ టీజర్ ని లాంచ్ చేశారు.
 
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు.  అంటే .. 'కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్' అనే చెప్పాలి. నాకు క్రైమ్ లో కామెడీ కనిపిస్తుంటుంది. ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూస్తున్నపుడు చాలా సరదాగా వుంటుంది. ‘పారిజాత పర్వం' టీజర్ నాకు చాలా ఆసక్తికరంగా, ఎక్సయిటింగా అనిపించింది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చైతన్య, హర్ష అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ జర్నీ ఎక్కడినుంచి మొదలైయిందో తెలుసు. వాళ్ళ జర్నీని చాలా మంది ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. అందుకే వారి పాత్రలని నటనని అంత ఇష్టపడుతున్నారు. చైతన్య అద్భుతమైన నటుడు. తను ఎంచుకుంటున్న పాత్రలు, సినిమాలు చాలా యూనిక్ గా ఉంటునాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్.  
 
చైతన్య రావు మాట్లాడుతూ.. తరుణ్ నా లక్కీ చార్మ్.  కీడాకోలాతో అది ప్రూవ్ అయ్యింది. నేను అతనకి నేను పెద్ద అభిమానిని. తరుణ్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్. పారిజాత పర్వం' కాన్సెప్ట్ టీజర్ తరుణ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. తరుణ్ బిగ్ థాంక్స్. తను రావడంతో ఒక ధైర్యం వస్తుంది. కీడాకోలా లానే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది. ఇందులో  సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ఇలా అందరి పాత్రలు చాలా బావుంటాయి. ముఖ్యంగా హర్ష పాత్ర మామూలుగా వుండదు. అద్భుతంగా చేశాడు. అలానే  సునీల్ అన్న పాత్ర కూడా చాలా బావుటుంది. రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. టీంలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి టీం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. చాలా మంచి సినిమా తీశాం. టీజర్ ట్రైలర్ ఇంకా ఆసక్తికరంగా వుంటాయి. ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యే సినిమా. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి'' అన్నారు.
 
మాళవిక సతీశన్ మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్ గారికి థాంక్స్. కాన్సెప్ట్ టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. నాపై నమ్మకంతో ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తప్పకుండా ఈ చిత్రం మీ అందరినీ అలరిస్తుంది'' అన్నారు.
 
సంతోష్ కంభంపాటి మాట్లాడుతూ.. తరుణ్ భాస్కర్ అన్న ఫిల్మ్ మేకింగ్ లో నాకు స్ఫూర్తి. ఆయన ఈ టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ‘పారిజాత పర్వం’ చాలా మంచి ఎంటర్ టైనర్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇందులో కొత్తదనం కనిపస్తుంది. కిడ్నాప్ అనేది బయట క్రైమ్. కానీ మా సినిమాలో అది ఆర్ట్. అది ఎలా అనేది ఈ సినిమా యుఎస్పీ. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.
 
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. నిర్మాతలు అభినందనలు. దర్శకుడు సంతోష్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఇందులో రెండు చక్కని పాటలు రాశాను. టీజర్ తరుణ్ భాస్కర్ గారు లాంచ్ చేయడం ఆనందంగా వుంది. మేము కూడా కీడాకోలా లాంటి విజయాన్ని అందుకుంటామనే నమ్మకం వుంది. అన్ని ఎలిమెంట్స్ వున్న సినిమా ఇది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది'' అన్నారు. ఈ వేడుకలో హర్ష, మురళీధర్ గౌడ్, శశాంక్ మిగతా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.