కాకర కాయల కరీ
|
కాకరకాయలు (పొట్టిగా సన్నపాటివి) - పావుకిలో, ఉల్లిపాయలు - మూడు, ధనియాలు - అరచెంచా, వెల్లుల్లి రెబ్బలు - ఐదు, దాల్చిన చెక్క - అరచెంచా, లవంగాలు - అరచెంచా, పసుపు - చిటికెడు, అల్లం - చిన్నముక్క, ఉప్పు - తగినంత, కారం - చెంచా, నూనె - అరకప్పు, చింతపండు - కాస్త.
తయారు చేయు విధానం :
ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి పొడవుగా నాలుగు భాగాలుగా విడిపోకుండా మధ్యకు తరిగి గింజలను ఏరేయ్యాలి. వీటిలో చింతపండు, ఉప్పు, పసుపులను వేసి మెత్తగా ఉడికించాలి. ఉడికిన తర్వాత ఇందులోని నీటిని వార్చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలలో మసాలా సామాగ్రి, కారాలను వేసి మెత్తగా నూరి దానిని కాకర కాయలలో కూరి విడిపోకుండా చూడాలి.
బాణాలి పెట్టి నూనె వేసి కాగాక అందులో కాకర కాయలను వేసి సన్నని మంటపై పెట్టి వేయించాలి. మూత పెట్టకుండా అలానే వేయించి తీసి వేడిగా సర్వ్ చేయండి.

