1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. శాకాహారం
  6. veg

బజ్జీ మిర్చి వేపుడు

వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
బజ్జీ మిర్చీ... వంద గ్రా.
ఉల్లిపాయ... ఒకటి
జీలకర్ర... ఒక టీ.
వాము... ఒక టీ.
శనగపిండి... వంద గ్రా.
ఉప్పు... తగినంత
కరివేపాకు... ఆరు రెమ్మలు
కొత్తిమీర.. చిన్న కట్ట
నూనె... సరిపడా

తయారీ విధానం :
ఉల్లిపాయలను, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా తరగాలి. శనగపిండిలో వాము, జీలకర్ర, ఉప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పకోడీల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. మిరపకాయల తొడిమ అలాగే ఉంచి మధ్యలోకి చీరాలి. ముందుగా కలిపి ఉంచిన పిండి మిశ్రమాన్ని కాయలలో కూరాలి.

బాణలిలో నూనె వేసి కాగిన తరువాత స్టఫ్ చేసిన మిరపకాయలను వేసి బజ్జీల్లాగా దోరగా వేయించి తీసేయాలి. అంతే వేడి బజ్జీ మిర్చి వేపుడు రెడీ..! వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకుని.. వీటిని సైడ్‌డిష్‌లాగా తింటే చాలా రుచిగా ఉంటాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి