1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
  4. What kind of pain occurs during periods?

పీరియడ్స్ సమయంలో ఎలాంటి నొప్పి వస్తుంది?

periods
పీరియడ్స్ సమయంలో ఎక్కువగా నొప్పి రావడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అలావస్తే శరీరంలోని అంతర్లీన సమస్యను సూచిస్తుందంటున్నారు. పీరియడ్ సమయంలో తేలికపాటి నొప్పి వస్తే అది ఆరోగ్యకరమైనదట. అంటే గర్భాశయం, అండాశయాలు చక్కగా పనిచేస్తాయనడానికి ఒక ఉదాహరణ అట.
 
ఇలాంటి సమయంలో పుల్లటి ఆహారాన్ని తీసుకోవాలట. పుల్లని ఆహారంలో సి విటమిన్ ఉంటుందని.. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయంపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా చల్లటి ఆహారాన్ని కూడా తీసుకోవచ్చట. 
 
అంతే కాకుండా ఆయిల్, స్పైసీ ఆహారాలకు పీరియడ్స్ వచ్చిన మహిళలు దూరంగా ఉంటేనే మంచిదట. ఎందుకంటే అవి గ్యాస్ట్రిక్ సమస్యకు కారణమవుతాయంటున్నారు. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. 
 
ఎందుకంటే గర్భం దాల్చడానికి మహిళల్లో అండోత్పత్తి జరగాల్సిన ఉంటుందని, ఇది సాధారణంగా పీరియడ్స్ ముగిసిన తరువాతే  జరుగుతుందంటున్నారు. మహిళలకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రాకుండా ఉంటే మాత్రం ఫలదీకరణతో ఉన్న సమయం పీరియడ్స్ కాలంలో అతిగా వ్యాప్తి చెందుతుందంటున్నారు. కాబట్టి మహిళలు గర్భనిరోధక మాత్రలు, రక్షణ లేకుండా శృంగారం చేయరాదని వైద్యులు చెబుతున్నారు.
తర్వాతి కథనం
లెమన్ జ్యూస్ అతిగా తాగేవారు ఇది తెలుసుకోవాల్సిందే