గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (18:10 IST)

అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఆస‌రా... సీఎం జ‌గ‌న్ కి పాలాభిషేకం!

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ని ఎటి అగ్రహరంలో ఉన్న ఎస్కెఎంబిలో 2వ విడత వైఎస్ఆర్  ఆసరా వారోత్సవాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఒక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే అక్క చెల్లమ్మలకు బాసటగా మొత్తంగా 2,975 డ్వాక్రా గ్రూప్ లకు 24 కోట్ల 33 లక్షల రూపాయలు మంజూరు చేశార‌ని చెప్పారు. మొదటి రోజు 545 గ్రూప్ లకు 8 కోట్ల కోట్ల 39 లక్షల రూపాయలు జమ చేస్తున్నామ‌ని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి  పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జిఎంసి కమిషనర్ అనూరాధ, డిప్యూటీ మేయర్ షైక్ సజీలా, కార్పొరేటర్లు అడకా పద్మావతి, అచ్చాల వెంకట్ రెడ్డి,షైక్ రోషన్, కాండ్రుగుంట గురవయ్య, పడాల సుబ్బారెడ్డి, గేదెల నాగ రంగమణి -గేదెల రమేష్,మెప్మా పిడి వెంకట నారాయణ, జి.ఎంసి డిప్యూటీ కమిషనర్ దేవరకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.