గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (13:21 IST)

ఒడిషాలో ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోలు మృతి

ఒడిషాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మల్కన్ గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో జవాన్ కు గాయాలు అయ్యాయి.
 
అతన్ని చికిత్స కోసం హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుండి ఒక ఇన్‌సాస్ రైఫిల్‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కన్ గిరి జిల్లాలో తుల్సిడోంగ్రి సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.