గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (14:30 IST)

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జూనియర్ కమిషన్‌డ్ ఆఫీసర్ (జేసీఓ) సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పిర్ పంజల్ రేంజ్ వద్ద జరిపిన కౌంటర్‌ టెర్రరిస్ట్ ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగింది.
 
జమ్ముకశ్మీర్ పూంఛ్ ప్రాంతంలో ముగ్గురు ముష్కరులు ఉన్నారనే సమాచారం భారత్ ఆర్మీకి వచ్చింది. వారిని పట్టుకునేందుకు భారత సైన్యం గాలింపు చేపట్టారు. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
 
మరవైపు అనంత్​నాగ్ జిల్లా ఖాగుండ్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాదిని భద్రతా బలగాలు ఉదయం మట్టుబెట్టాయి. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్​లో తెలిపారు. బందిపొరా హాజిన్​లో సోమవారం తెల్లవారు జామున జరిగిన ఎన్​కౌంటర్​లో మరో ఉగ్రవాది హతమయ్యాడు.