మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (12:06 IST)

చిత్రగామ్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లా చిత్రగామ్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
 
అంతకుముందు బుధవారం సాయంత్రం చిత్రగామ్‌లో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఓ పౌరుడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గాలింపు బృందాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడని జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. అతడిని అనాయత్‌ అహ్మద్‌ దార్‌గా గుర్తించామన్నారు. అతని వద్ద ఒక పిస్తోల్‌, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.