మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:38 IST)

చిన్నారి రేప్ అండ్ మర్డర్.. రంగంలోకి సజ్జనార్

సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. పోలీసులు నింధితుడి కోసం గాలింపులు ముమ్మరం చేశారు. బృంధాలు గా ఏర్పడి నింధితుడి కోసం గాలిస్తున్నారు. 
 
ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో రాజు తల్లి దండ్రులు అక్కా బావ ఉండగా వారిని విచారిస్తున్నారు. అలాగే పోలీసులు రాజు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజును పట్టుకునేందుకు పోలీసుశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
 
రాష్ట్రవ్యాప్తం గా నాకా బంధీ నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఈ కేసును ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన సజ్జన్నార్ కు అప్పగించాలంటూ డిమాండ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. 
 
కాగా ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జన్నార్ కూడా ఈ కేసులో రాజును పట్టుకునేందుకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు అలెర్ట్‌గా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని బస్స్టాండ్‌లలో బస్సులో పోస్టర్స్ ఆర్టీసీ పోస్టర్లను అంటిస్తోంది.