1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. కథనాలు
  6. Summer

వేసవిలో నయనాల సంరక్షణ..!!

కళ్లు
FILE
కళ్లు ఎన్నో భావాలను పలికిస్తాయి. అందాన్ని కూడా పెంచుతుంది. అలాంటి కళ్లను ఏ మాత్రం అజాగ్రత్తగా చూసుకోకూడదు. నల్లటి వలయాలు, ఉబ్బినట్లు కనిపించడం వంటి సమస్యలు వస్తే, వాటి నుంచి విముక్తి పొంది తళుక్కున మెరిసే నయనాలు సొంతం చేసుకోవాలంటే....

* శరీరానికి సమతులాహారం అవసరం. ఇది ఆరోగ్యాన్ని, మేని సౌందర్యాన్ని ప్రభావితం చేస్తుంది. క్యారెట్లు, పాలకూర, బొప్పాయి, మామిడి వంటివి నల్లటి వలయాలను తొలగించడానికి సహకరిస్తాయి.

* కొందరు అదేపనిగా కళ్లను నలుపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బలహీనంగా ఉన్న రక్త నాళాలు ప్రభావితమై నల్లగా మారుతుంది. అందుకే తరచూ కళ్లు మూస్తూ తెరుస్తూ ఉండాలి. ఇది కంటికి మంచి వ్యాయామం.

* ఈ సమస్యకు మరో కారణం సరైన విశ్రాంతి లేకపోవడం. పొద్దుపోయే వరకూ మెలకువగా ఉండటం, కలత నిద్ర వంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. రోజూ ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. అలాగే ఏ మాత్రం అవకాశం దొరికినా కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి.

* చల్లటి వాతావరణం కంటికి మేలు చేస్తుంది. అలసటను తగ్గిస్తుంది. కళ్లు చింత నిప్పుల్లా ఉంటే, బంగాళాదుంప లేదా కీరదోసను సన్నని చక్రాలా కోసుకుని కనురెప్పలపై ఉంచితే వేడిని పీల్చేసుకుంటాయి. వేడికి కళ్లు మంటపుడుతున్నప్పుడు చల్లటి నీటిలో తడిపిన వస్త్రంతో తుడుచుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగును ఉంచినా ఫలితం ఉంటుంది.

* మస్కారా వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మేకప్‌ను తొలగించడానికి ఉపయోగించే కఠినమైన ఉత్పత్తులూ ఇలాంటి సమస్యను పెంచుతాయి. దీన్ని తగ్గించాలంటే పచ్చిపాలల్లో ముంచిన దూదితో మేకప్‌ను సులువుగా తొలగించవచ్చు. రోజ్ వాటర్‌ను ఉపయోగించినా ఇదే ఫలితం ఉంటుంది.

* అసలే వేసవి కాలం సూర్యుని నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలు ఎంతో ప్రమాదకరం. ఇవి కంటిని తాకకుండా చలువ కళ్లద్దాలు పెట్టుకోవాలి. ఎండలో తిరిగివచ్చిన వెంటనే కళ్లపై నీళ్లు చల్లుకోవాలి.