1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
  4. Amazing tips for the eye fires relief

కంటి మంటలకు కలబంద గుజ్జుతో మర్దన చేసుకుంటే?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాటిల్లో కంటి సమస్యలు ప్రధానమైనవి. ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు వీటితోనే పనిచేస్తుంటారు. దీంతో

eyes
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. వాటిల్లో కంటి సమస్యలు ప్రధానమైనవి. ఆఫీసుకు వెళితే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు వీటితోనే పనిచేస్తుంటారు. దీంతో నేత్ర సంబంధ సమస్యల బారిన పడేవారు పెరుగుతున్నారు. కొందరికి దృష్టి సరిగ్గా కనిపించక పోవడం వలన అద్దాలు, లెన్స్‌లు పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.
 
మరికొందరికి కళ్లు మంటలు, దురదలు, కంటి నుండి నీరు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందుటకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని తీసుకుని గోరువెచ్చని నీళ్లలో ముంచి ఆ వస్త్రాన్ని కళ్ల మీద 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆ తరువాత కళ్లపై మెత్తగా ఒత్తాలి. ఇలా చేయడం వలన కళ్లలో పడిన దుమ్ము, ధూళి తొలగిపోతుంది.
 
కళ్లలో తిరిగి నీరు ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా కళ్లు పొడిబారడం తగ్గి దురదలు, మంటలు తగ్గుతాయి. కలబంద ఆకుని బాగా కడిగి దానిని కట్‌చేసి మధ్యలోనుండి గుజ్జును బయటకు తీసుకోవాలి. ఆ గుజ్జును కనురెప్పలపై రాసుకుని కళ్లు మూసుకుని 10 నిమిషాల పాటు అలానే ఉండాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
 
రోజుకు ఇలా రెండుసార్లు చేయడం వలన కంటి మంటలు తగ్గిపోతాయి. రోజ్‌వాటర్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ సరిగ్గా అందకపోయినా కూడా కళ్లు పొడిబారుతాయి. అందువలన రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి కళ్లు మూసుకుని రెప్పలపై ఆ దూదిని ఉంచాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి దురదలు, మంటలు నుండి ఉపశమనం పొందవచ్చును.
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
విటమిక్ 'కె' ఎందుకు అవసరమో తెలుసా?