Astrology Yearly Horoscope Details

Notifications

తుల తుల
తులారాశి : చిత్త 3,4 పాదములు, స్వాతి 1 2 3 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాలు ఆదాయం - 5, వ్యయం- 14, రాజపూజ్యం - 6, అవమానం - 3 ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం అంతా ఫలప్రదంగా ఉంటుంది. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు పోగలరు. యత్నాలకు దైవబలం తోడవుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలకు ఏదో ఒక మార్గంలో ధనం సమకూరుతుంది. సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య అప్పుడప్పుడు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి. సొంత ఇల్లు, వాహనం అమర్చుకోవాలనే కోరిక ఫలిస్తుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ప్రముఖులకు మరింత సన్నిహితులవుతారు. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఒకరి వద్ద మరొకరి గురించి మాట్లాడి ఇబ్బందులు తెచ్చుకుంటారు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వివాహయత్నం ఫలించే అవకాశం ఉంది. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలు, సాధ్యం కాని కోరికలు కోరవద్దు, ముఖ్యంగా జాతక పొంతన ప్రధానమని గమనించండి. పుణ్యక్షేత్ర సందర్శనాలు, గృహంలో శుభకార్యాలతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు సైతం మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలిసివస్తుంది. మీ పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుర కలిసివస్తాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, కోరుకున్న చోటికి స్థానచలనం, విదార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగుంటాయి. లక్ష్యసాధనకు వీరు మరింత శ్రమించాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా చదువు పైనే దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు, ర్యాగింగ్ వంటి విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఈ సంవత్సరం ఆశాజనకం. అధిక పంట దిగుబడులు సాధించటంతో పాటు మద్దతు ధర కూడా పొందుతారు. మెట్టరైతులకు కొంత మేరకు మెరుగ్గా ఉంటుంది. కూరగాయలు, పండ్లు, పూలు సాగుచేసే రైతులకు సామాన్యంగా ఉంటుంది. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామికంగా నూతన వ్యాపారాలు చేపడతారు. హోల్‌సేల్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో స్టాకిస్టులు తగు జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. ఆక్వా రంగ రైతులు మరింత లాభాలు గడిస్తారు. కోళ్లఫారం రైతులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి. అంతు తెలియని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడే సూచనలున్నాయి. ఈ రాశివారు అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురైనా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. అవివాహితులకు శుభయోగం, నిరుద్యోగులకు ఉద్యోగావకాశం ఉన్నాయి. నిత్యం ఆప్తులతో సంభాషిస్తుంటారు. బంధుమిత్రుల రాకపోకలతో గృహం సందడిగా ఉంటుంది. మీ చొరవతో సన్నిహితుల ఇంట శుభకార్యం జరుగుతుంది. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఏ సంవత్సరం వ్యవహార జయం, కార్యసిద్ధి, ధనలాభం, వస్త్రప్రాప్తి, శత్రువులపై విజయం వంటి శుభఫలితాలున్నాయి.

బాపట్ల సూర్యలంక- చీరాల బీచ్ అదిరిపోయింది, నేను ఎక్స్‌పెక్ట్ చేయలా: హీరో శ్రీకాంత్, వీడియో

పోయే ప్రాణాన్ని సెకన్ల వ్యవధిలో రక్షించిన రైల్వే గేట్ కీపర్, వీడియో

పోయే ప్రాణాన్ని సెకన్ల వ్యవధిలో రక్షించిన రైల్వే గేట్ కీపర్, వీడియోరైలు గేటు వేసి వున్నప్పుడు రైలు పట్టాలు దాటవద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా పలువురు అదేమీ పట్టించుకోరు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా తల వంచుకుని అదేదో సురక్షితమైన రహదారి అన్నట్లు వెళ్తుంటారు. ఫలితంగా తమ ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తారు. కొన్నిసార్లు ఎలాగో బ్రతి బైటపడతారు. ఇంకొందరు ప్రమాదం బారిన పడి అంగవికలురుగా మిగులుతారు. తమిళనాడులోని మాయిలాడుతురై జిల్లాలోని సిరిఖాజి రైలు పట్టాలపై ఓ వ్యక్తి గేటు వేసినప్పటికీ క్రాస్ చేస్తున్నాడు. అదే సమయంలో ఆ మార్గంలో రైలు వేగంగా వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన గేట్ కీపర్ తన ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసి ఆ వ్యక్తిని కాపాడాడు.

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియోద్వాపరయుగంలో ద్వారకాధీశుడు, మధురాధిపతి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజును నేడు హిందువులందరూ భక్తిశ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కృష్ణుడు జన్మించిన మధుర చెరసాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల స్థలం ఇప్పటికీ ఉంది. దీనిని 'శ్రీ కృష్ణ జన్మభూమి' ఆలయ ప్రాంగణంలో అత్యంత పవిత్రమైన 'గర్భ గృహం' రూపంలో సంరక్షిస్తున్నారు. దేవకి, వసుదేవులను కంసుడు బంధించిన అసలు చెరసాల ఉన్న స్థలంలోనే ఈ చిన్న భూగర్భ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రాచీన రాతి గోడల ఆనవాళ్లను, కృష్ణుడి జన్మస్థాన వేదికను చూడవచ్చు.

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)

Nepal flash flood 2026: నేపాల్ వరదలు.. ముందుగానే పలాంచోక్ భగవతి అమ్మవారికి చెమటలు.. హెచ్చరిక? (video)నేపాల్‌లో ఆకస్మిక వరదలు రావడానికి కొన్ని రోజుల ముందు పలాంచోక్ భగవతి అమ్మవారి విగ్రహం నుండి నీటి బిందువులు (అంటే చెమట లాగా) కారిన సంఘటనను భక్తులు ఒక దైవిక హెచ్చరికగా నమ్ముతున్నారు. నేపాల్‌లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో కొండ శిఖరంపై ఉన్న పలాంచోక్ భగవతి ఆలయం, దేశంలోనే అత్యంత శక్తివంతమైన పురాతన శక్తి పీఠాలలో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయం నేపాల్‌లోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న భగవతి అమ్మవారి విగ్రహం ఒకే నల్లరాతితో అందంగా చెక్కబడిన మూడు అడుగుల ఎత్తు కలిగినది. ఈ అమ్మవారి విగ్రహం పద్దెనిమిది చేతులతో దర్శనమివ్వడం ప్రత్యేకత. అంతేకాకుండా ఇది చాలా పురాతనమైనది, అంటే సుమారు 1300 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనది. ఈ భగవతి అమ్మవారు, నేపాల్‌లోని ఇతర భగవతి అమ్మవార్లందరికీ పెద్దగా పరిగణించబడుతుంది.