Christian Religion

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. క్రైస్తవ



జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ భాగస్వామ్యం

జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌తో గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ భాగస్వామ్యంహైదరాబాద్‌: డాక్టర్‌ రవీంద్రనాథ్‌ కంచెర్ల నాయకత్వంలో గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌(గిరి) పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌(జీయూఎఫ్‌), జపాన్‌కు చెందిన సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌(ఎస్‌బీఐ)తో వ్యూహాత్మక శాస్త్రీయ భాగస్వామ్యాన్ని చేసుకున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ అధ్యక్షుడు డాక్టర్‌ హిరోఆకి కిటానో హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. 2026 నవంబర్‌ 1న పరిశోధన సహకార ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా ఈ భాగస్వామ్యానికి అధికారిక రూపం లభించింది. హైదరాబాద్‌లో సమీకృత విశ్వవిద్యాలయం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించాలన్న జీయూఎఫ్‌ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.

తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. సుప్రీం

తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. సుప్రీంతిరుపతి లడ్డూ కల్తీకి సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ప్రస్తుత దశలో ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చడానికి తగిన కారణాలు లేవని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మచింద్ర శాంతారాం లాంకే, మెసర్స్ మల్గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ దాఖలు చేసిన క్రిమినల్ బదిలీ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, దీనివల్ల విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

ఏయ్.. గాజు గ్లాసు ఎందుకు తెచ్చావ్- పోలింగ్ సిబ్బంది: ఐతే ఈ ఫ్యాన్ పీకెయ్- ఓటరు రిప్లై, వీడియో