యేసు దగ్గరకు రండి

christian
ivr| Last Modified గురువారం, 24 డిశెంబరు 2015 (22:31 IST)
చాలామంది విద్యావంతులు తమకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. సత్యశోధన చేస్తారు. నిజమైన సత్యం యేసు బోధనలలోనే దొరుకుతుంది. దానిని ఎలా నీకొదేము అనే విద్యావేత్త పరిశోధించాడో తెలుసుకుందాం. యూదుల అధికారి నీకొదేమను పరిసయ్యుడొకడుండెను.

అతడు రాత్రి యందు ఆయన (యేసు) యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవరును చేయలేరని ఆయనతో చెప్పెను. అందుకు యేసు కడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. (యోహోను 3:1-4)

పరిసయ్యులు ఎవరు?
పరిసయ్యులు యూదా మత పెద్దలు. దేవుడు, మోషేల ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవారు. బ్రహ్య ప్రపంచానికి మాత్రం భక్తి పరులుగా కనిపిస్తారు. ధర్మశాస్త్రంలో, పాపంలో పట్టుబడిన వారు రాళ్ళతో కొట్టి చంపాలి. శరీరంలో ఏ భాగంతో పాపం చేస్తే, ఆ భాగాన్నీ నరికేసేవారు. కంటికి కన్ను పీకేసేవారు యూదా మత చాంధసులు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించేవారు. అలాంటి మత పెద్దలతో నీకొదేము ఒకరు. యేసు చేసిన అద్భుతాలు, స్వస్థతలు చూసి ఆశ్చర్యపోయారు.

ఆయన నిజంగా దేవుని ద్వారా సూచక క్రియలు చేస్తున్నారని సమ్మాలి. దేవుని రాజ్యంలో తానూ ప్రవేశించాలని ఆశతో యేసును విచారించడానికి వచ్చాడు. సమాజానికి భయపడి, అధికారియైన నీకొదేము రాత్రి వేళ యేసు దగ్గరక వెళ్ళాడు. యేసు బోధలను, సూచక క్రియలను వ్యతిరేకించిన వారు పరిసయ్యులే వారిలో నీకోదేము ఒకరు. అతడు మదాధికారియైనా సత్యం తెలియని వ్యక్తి. ఆసత్యాన్నీ తెలుసుకోవడానికే యేసు వద్దకు వచ్చాడు.

యేసే రక్షకుడని విశ్వసించాలి
యేసు తన దగ్గరకు వచ్చే ఎవరినైనా తిరిగి పంపరు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే, యేసే రక్షకుడని హృదయంలో విశ్వసించి, నోటితో ఒప్పుకోవాలి. యేసు శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో పాపాలను కడిగే శక్తి ఉన్నది. యేసుతో మాట్లాడి సత్యం తెలుసుకొన్నాడు నీకొదేము. ముసలి వాడయినను చీకటిలో వచ్చి, యేసు వాక్యపు వెలుగును పొందాడు. నిజమైన సత్యం తెలుసుకోవాలంటే యేసు దగ్గరకు రండి.!దీనిపై మరింత చదవండి :