శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. క్రైస్తవ
Written By ivr
Last Modified: బుధవారం, 28 మార్చి 2018 (22:23 IST)

ఈస్టర్ రోజున ప్రార్థనలు చేసిన వారికి....

క్రైస్తవ పరమాత్ముడు ఏసుక్రీస్తును శిలువలో వేసిన రోజే గుడ్‌ఫ్రైడేగా పరిగణించబడుతోంది. గుడ్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడే ఈ రోజున క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజల్లో పాల్గొంటారు. ఏసుక్రీస్

క్రైస్తవ పరమాత్ముడు ఏసుక్రీస్తును శిలువలో వేసిన రోజే గుడ్‌ఫ్రైడేగా పరిగణించబడుతోంది. గుడ్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడే ఈ రోజున క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజల్లో పాల్గొంటారు. 
 
ఏసుక్రీస్తును శిలువ వెయ్యటం మరియు కాల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను ఈ రోజున క్రైస్తవులు నెమరువేసుకుంటారు. పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున క్రైస్తవులు ప్రార్థనలతో జీసస్‌ను ప్రార్థిస్తారు.
 
క్రీస్తు యొక్క సంహేద్రిన్ ప్రయత్నం గురించి రచించబడిన వివరాల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది. రెండు వేర్వేరు సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం ఏడీ 33గా అంచనా వెయ్యబడింది. వాస్తవానికి బైబిలికల్ మరియు జూలియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు మరియు చంద్రవంక ద్వారా ఐజాక్ న్యూటన్‌చే ఏడీ 34గా చెప్పబడింది. 
 
కాబట్టి గుడ్‌ఫ్రైడే రోజున క్రైస్తవ సోదరులు ఏసుక్రీస్తును నిష్టతో పూజిస్తే.. పుణ్య ఫలితాలతో అనుగ్రహిస్తాడని విశ్వాసం. ఇంకా పవిత్ర వారమంతా ఉపవాసముండి ఈస్టర్ విందు తీసుకునే వారికి ఏసుక్రీస్తు సకల భోగభాగ్యాలను ప్రసాదించి, ఈతిబాధలను తొలగిస్తాడని క్రైస్తవ మతస్థుల నమ్మకం.