1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. high bp paralysis risk will reduce palakura

హై బీపీని కంట్రోల్ చేసి... పక్షవాతాన్ని నివారించే పాలకూర...

high bp paralysis risk will reduce palakura
మన శరీరంలో ఏర్పడే రోగాలన్నిటికి ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే కూరగాయలు, ఆకుకూరలే మందుగా పనిచేస్తాయి. ఈ విషయం ఎన్నడో రుజువైనప్పటికీ తాజాగా హైపర్‌టెన్షన్ (హైబీపీ) వలన ఏర్పడే పక్షవాతాన్ని నివారించడంలో పాలకూర బాగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆ అధ్యయన వివరాలను 'ద జర్నల్ ఆఫ్ ద' అమెరికన్ అసోసియేషన్ అనే మెడికల్ జర్నల్‌‌‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. 
 
ఆ ప్రకారం.. శాస్త్రవేత్తలు హైబీపీ ఉన్న 20,702 మందిపై అధ్యయనం నిర్వహించినట్టు తెలిసింది. హైబీపీని తగ్గించే ఎనాలప్రిల్ అనే మందును వాడుతున్న వారికి మందుతో పాటూ ఫొలిక్ యాసిడ్ అధికంగా ఉండే పాలకూరలు, ఇతర ఆకుకూరల కాంబినేషన్లలో ఆహారాన్ని అందించారు. అప్పుడు ఫోలిక్ యాసిడ్‌ను క్రమం తప్పకుండా తమ ఆహారంలో తీసుకుంటున్న వారిలో గుండెపోటు వచ్చేందుకు అన్ని విధాలా రిస్క్ ఉన్నవారే అయినప్పటికీ అవి వచ్చే అవకాశాలు 21 శాతం తగ్గిందని అధ్యయనవేత్తలు గుర్తించారు. 
 
అంతేకాకుండా పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గాయని వారు తేల్చిచెప్పారు. అదే విధంగా 40 ఏళ్ల వయస్సు దాటిన వారు ప్రతిరోజూ పాలకూరను తీసుకోవడం వలన బీపీ కంట్రోల్‌లో ఉంటుందని వారు స్పష్టం చేశారు.
About Writer
CVR