1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. tips for cracked heels

గోరింటాకుతో పాదాల పగుళ్లకు చెక్..

tips for cracked heels
గోరింట అనగానే 'గోరింటా పూచింది కొమ్మా లేకుండా... మురిపాల అర చేత...' అనే ముత్యాల ముగ్గు సినిమా పాట గుర్తుకొస్తుంది. అయితే చేతులకు ఇంతటి అందాన్ని అందించే గోరింటాకు కాళ్ల పాద సౌందర్యానికి బాగానే ఉపకరిస్తుంది. 
 
చలికాలం వస్తే చాలు పాదాలకు పగుళ్లు ఏర్పడి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. తద్వారా పాదాలు అందవిహీనంగా తయారవుతాయి. అటువంటప్పుడు టీనేజ్ అమ్మాయిల సౌందర్య సాధనాల్లో ప్రముఖమైన గోరింటాకును బాగా నూరి అరి కాళ్లకు రాసుకుంటే పాదాల పగుళ్లు మటుమాయమై, నునుపుగా అందంగా దర్శనమిస్తాయి.
About Writer
CVR