సంబంధిత వార్తలు
- అమేజాన్ యాపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌పై రూ.9వేల తగ్గింపు
- నేటి తరం విజ్ఞానాన్ని పట్టారు - జ్ఞానాన్ని వదిలేశారుః కోట శ్రీనివాసరావు
- ఐఫోన్ నుంచి ప్రైవేట్ ఫోటోలు లీక్ : రూ.36 కోట్ల అపరాధం చెల్లిచిన యాపిల్
- అక్కడ పొటాటో ఐస్ క్యూబ్స్ అప్లై చేయండి, చిన్మయి శ్రీపాదకు సలహా
- ఆపిల్ పండ్లు ఆర్డర్ చేస్తే 'ఆపిల్ ఎస్ఈ (iphone SE) వచ్చిందోచ్..!
పెగాసెస్ ఎఫెక్ట్.. Windows and Apple యూజర్లకు కేంద్రం హెచ్చరిక
iPhone, iPad
తాజాగా.. కేంద్ర టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (cert -in) విండోస్, ఆపిల్ ఐఫోన్, యాపిల్ ఐ ప్యాడ్, మాక్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సైబర్ దాడులు జరిగే ఆపరేటింగ్ సిస్టమ్స్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని టీమ్ హెచ్చరికలు జారీ చేసింది. విండోస్, ఆపిల్ ఐఫోన్, యాపిల్ ఐప్యాడ్, మాక్ యూజర్లకు హెచ్చరికలు చేసింది.
సైబర్ నేరస్తులు, ప్రైవేటు, ప్రభుత్వ రంగానికి చెందిన సంబంధిత శాఖల రహస్యాలను సేకరించేందుకు టార్గెటెడ్ కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్ లను కోడ్ ఎగ్జిక్యూషన్ సాయంతో దాడి చేస్తారని..ఆ సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేసింది.
మితిమీరిన అనుమతుల కారణంగానే…యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్ లో ఉన్న ఫైళ్లు, డేటా బేస్ తో పాటు సెక్యూర్టీ అకౌంట్స్ మేనేజర్ (SAM)లు భద్రతాలోపం తలెత్తినట్లు వెల్లడించింది. దీని కారణంగా…పాస్ వర్డ్ లను గుర్తించి… సిస్టమ్ డ్రైవ్‌లను దొంగిలించే అవకాశం ఉందని వెల్లడిస్తోంది.
తర్వాతి కథనం
