1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (11:12 IST)

గ్లోబల్ మార్కెట్ లోకి Tesla Pi Mobile 5G 2022

Tesla
Tesla
ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ గ్లోబల్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోనును తీసుకురానున్నట్లు ప్రకటించింది. టెస్లాపై మొబైల్ 5జీ ఫోన్ 2022 Tesla Pi Mobile 5G 2022 అనే పేరు కూడా పెట్టేసింది. ఈ కొత్త టెస్లా పిఐ మొబైల్ గాడ్జెట్ డిసెంబర్ 2022 చివరిన విడుదలయ్యే అవకాశం వుంది. టెస్లా పై మొబైల్ మోచా బ్రౌన్, బ్లాక్, పాలిష్డ్ బ్లూ, పింక్ గోల్డ్ వంటి మొత్తం నాలుగు కలర్లలో అందుబాటులోకి రానుంది. 
 
ఈ మొబైల్ స్పెషాలిటీ ఏంటంటే.. ఈ ఫోన్ కేవలం సిటీల్లోనే కాదు.. అడవులు, పర్వత ప్రాంతాల్లోనూ దీని నెట్‌వర్క్ సిస్టమ్ పనిచేస్తుంది. గంటలు తరబడి గేమ్స్ ఆడినా, మ్యూజిక్ వింటున్నా, మూవీలు చూసినా బ్యాటరీ లైఫ్ మాత్రం ఎక్కువ సమయం పనిచేస్తుంది. రెండు SIM కార్డ్‌లను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి GSM, 3G, HSPA+, LTE, 5G టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. 
 
ఫీచర్స్.. 
Tesla Pi 2022 మొబైల్ ఫోన్ టెస్లా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 
720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లే స్క్రీన్‌ను కలిగి ఉండనుంది. 
6.67-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే స్క్రీన్ 4కె రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 
టెస్లా స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో సేఫ్‌గా ఉంటుంది.
5000mAh బ్యాటరీ కూడా ఉండవచ్చు.