సంబంధిత వార్తలు
- సీఎం జగన్ అడ్డాలో పట్టపగలు వైకాపా కార్యకర్త దారుణ హత్య
- మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం
- చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం
- ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?
- రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు...
మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
మాజీ మంత్రి మల్లా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లోని తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని మల్లారెడ్డి పోలీసులకు చెప్పారు.
ఆ స్థలంలో వేసిన ఫెన్సింగ్‌ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పారు మల్లారెడ్డి. వివాదంలోని భూమిలో ఘర్షణకు దిగొద్దని ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. దీనిపై పోలీసులతో పెద్దగా వాగ్వాదానికి దిగారు మల్లా రెడ్డి.
కేసు పెడితే పెట్టుకోండి.. తన స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మల్లా రెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చి వేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పరిస్థితి సర్ధుమణిగేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డిని బషీర బాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
