చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం
కిక్కిరిసి వుండే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్. ఒక జంక్షన్ నుంచి మరో జంక్షన్ కి చేరుకోవాలంటే దూరం కొద్దిగే అయినా గంటలకొద్దీ టైం పడుతుంది. ఇలాంటి సిటీలో ఓ వ్యక్తి తన కారులో చోటుచాలకపోవడంతో యువతిని కారు పైకి ఎక్కించి కారు నడుపుతున్న వీడియో వైరల్ అవుతోంది.
విషయం ఏంటంటే... ఆమెను అలా కారు పైన ఎక్కించుకుని నడుపుతుంటే ఎవరూ అడ్డు చెప్పడంలేదు. సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసుల కంట పడకుండా ఇతగాడు చాకచక్యంగా నడుపుకుంటూ వస్తున్నాడేమో తెలియదు కానీ యువతి అలా కారుపైన కూర్చుని ప్రయాణం చేయడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.