రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...
హైదరాబాద్‌లో ఓ మహిళ సైబర్ నేరగాడి వలలో పడింది. హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఈ నెల 15న రాత్రి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది.
తనను తాను మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకున్న అతడు.. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని చెప్పడంతో ఆమె వణికిపోయింది. ఆమెతో మాట్లాడుతూనే ఉన్న నిందితుడు.. ఆమెను బ్యాంకుకు పంపి రూ. 60 లక్షలు తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.
డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కి ఫోన్ చేసి విషయం చెప్పి ఫిర్యాదుచేశారు. ఎస్బీఐ ఖాతాలకు అప్పటికే నగదు బదిలీ కావడంతో బ్యాంకు ప్రతినిధులను అప్రమత్తం చేసి ఆయా ఖాతాల నుంచి నగదును ఉపసంహరించకుండా లాక్ చేయించారు.