1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (23:10 IST)

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

Santoshimatha
Santoshimatha
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఓంనగర్ కాలనీలోని సంతోషిమాత ఆలయంలో నిత్య పూజల్లో భాగంగా శుక్రవారం సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రాన్ని భక్తులు సమర్పించారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బచ్చు బుచ్చయ్య, పుష్పమ్మ దంపతులు ఆలయ కమిటీ సభ్యులు భాగ్యమ్మ, రాజేశ్వరి, శివకుమార్‌లకు ఆలయ ప్రధాన అర్చకులు అల్లాడి ప్రకాష్‌శర్మ అలంకరణ కోసం అందజేశారు. 
 
వైశాఖ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అల్లాడి ప్రకాశశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా వైశాఖ మాసం అభిషేకం, కుంకుమార్చన, కలశంపూజ, ఉద్యాపన, ఓడిబియ్యం, మహాప్రసాదాల నివేదన, మహా మంగళహారతి, ఉయ్యాల సేవ, పవళింపు సేవలు జరిగాయి. 
 
అనంతరం సరస్వతి, శ్రీనివాసులు, లక్ష్మి ఆధ్వర్యంలో 90 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏవో వేణుగోపాలరావు, మలిపెద్ది భాగ్యమ్మ, పెద్దమరూర్ రాజేశ్వరి, రాచర్ల శివకుమార్, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.