ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 17 మే 2024 (22:43 IST)

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

telangana govt
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత వాహన రిజిస్ట్రేషన్లకి TS వుండేట్లు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇపుడు తాజాగా TS కాకుండా TGపైనే వాహన రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనితో అధికారిక సమాచారాల్లో అన్నిచోట్లా TSకి బదులుగా TG అని ప్రస్తావించాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు.