శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (20:56 IST)

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

Rains
ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమను ఆనుకుని ఉత్తర తమిళనాడు మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని, అదే సమయంలో ఛత్తీస్ గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపింది. 
 
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం నెల్లూరు, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.