సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మే 2024 (19:39 IST)

తెలంగాణ: మూడు రోజులు జాగ్రత్త.. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఓ మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. 
 
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో మంగళవారం మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 
 
హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలు కూడా రాగల 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులలో నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారులు సూచించారు.