1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 17 మే 2024 (22:35 IST)

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

dry dates with milk
ప్రతిరోజూ పాలలో ఖర్జూరాన్ని నానబెట్టి తీసుకుంటే రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు బలం కూడా వస్తుంది. పాలతో ఖర్జూరాలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఖర్జూరంలో ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
పాలతో కలిపి తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
ఖర్జూరాలను రాత్రిపూట పాలలో వేసి తెల్లారక తాగితే మంచి శక్తి వస్తుంది.
ఖర్జూరం పాలను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం చేసుకోవచ్చు.
ఖర్జూరం పాలను తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.
ఖర్జూరం పాలలో విటమిన్ బి6 ఉండటం వల్ల జ్ఞాపకశక్తి బలపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండటం వల్ల ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
గమనిక: వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ప్రయత్నించండి.