బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 14 మే 2024 (20:25 IST)

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
తాజా లేత ఆకులను 10-15 నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది.
ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
లేత ఆకుల వేప రసంలో అనేక ఔషధ గుణాలున్నాయి, ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవని అధ్యయనంలో తేలింది.
వేప గింజలలో ఒక క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది జుట్టు, చర్మానికి హాని కలిగించే పరాన్నజీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
వేప ఆకు పదార్దాలు లేదా రసం గాయాలను నయం చేయడానికి దోహదపడతాయి.
వేప పుల్లలతో దంతాలను తోముకుంటుంటే అది నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.