గురువారం, 20 జూన్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 10 మే 2024 (19:19 IST)

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

Moringa Tea
ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడం, శక్తిని అందించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుపొడి నీరు తాగితే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీటిని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వీటి ఆకులు విటమిన్ సి కలిగి వుంటాయి.
ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఖాళీ కడుపుతో మునగ ఆకులపొడి నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.
ఒక గ్లాసు మునగ ఆకులపొడి నీటిని తాగితే శరీరానికి అవసరమైన శక్తిని అందించవచ్చు.
మునగ ఆకులు ఇనుము యొక్క గొప్ప మూలం, ఇది మన కణాలు, కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి దోహదం చేస్తుంది.
కప్పు నీటిలో టీ స్పూన్ మునగాకు పొడి వేసి 5 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత వడకట్టి గోరువెచ్చగా తాగవచ్చు.