గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 10 మే 2024 (22:13 IST)

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఈకాలంలో చాలామంది అపార్టుమెంట్లలో వుంటున్నారు. కొన్నిసార్లు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తుంది. మరికొందరు ఇదో వ్యాయామంలా మెట్లు ఎక్కుతుంటారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు మెట్లు ఎక్కరాదు అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము.
 
దీర్ఘకాలిక మోకాలు లేదా తుంటి సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కరాదు.
తీవ్రమైన గుండె సమస్యలున్నవారు మెట్లు ఎక్కి వెళ్లకూడదు.
వెర్టిగో వల్ల నడక, బ్యాలెన్స్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులు మెట్లు ఎక్కితే పడిపోవడం లేదా గాయపడడం జరగవచ్చు.
అవయవాలు అస్థిరంగా వున్నవారు మెట్లు ఎక్కకుండా ఉండాలి.
హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు కూడా మెట్లు ఎక్కకూడదు.
ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి.
కీళ్ల నొప్పులు, వాపుతో ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులు మెట్లు ఎక్కకూడదు.
వయసు పైబడిన వృద్ధులు కూడా మెట్లు ఎక్కడం చేయకూడదు.