సంబంధిత వార్తలు
- రైతుల కష్టాల్లో ఉంటే.. నేను కారెక్కి ఇంటికి పోతానా? ఇక్కడి నుంచే పాదయాత్ర
- లిస్బన్ పబ్‌లో అశ్లీల డ్యాన్సుల జోరు...
- నేనో మూర్ఖుడిని.. దేవుడు చెప్పినా వినను.. టీడీపీ అభ్యర్థి గెలిచినా.. నేలపై కూర్చోవాల్సిందే.
- ప్రేమకు అడ్డుగా వుందని ఎంత పనిచేశాడు.. చెన్నైలో దారుణం
- అల్లు అర్జున్‌తో అది నిజమైతే బావుండు: సయీ మంజ్రేకర్
ఓ నిండు ప్రాణం తీసి ఆమ్లెట్.. ఎక్కడ?
ఆమ్లెట్ ఒకటి ఓ నిండు ప్రాణాన్ని తీసింది. ఆమ్లెట్ కావాలని కోరిన ఓ వ్యక్తిపై దుకాణం యజమాని తన సిబ్బందితో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లంగర్‌హౌస్‌కు చెందిన వికాస్(35) ప్రైవేటు ఉద్యోగి. పీర్జాదిగూడలో ఉండే స్నేహితుడు బబ్లూతో ఆదివారం సాయంత్రం ఉప్పల్‌లోని మహంకాళి వైన్స్‌కు వెళ్లాడు. పర్మిట్ రూంలో మద్యం తాగుతూ ఆమ్లెట్ చెప్పారు.
అయితే, రూ.60 చెల్లించాలని దుకాణ నిర్వాహకుడు వికాస్‌ను అడిగాడు. ఈ విషయమై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన యజమాని దుకాణ సిబ్బందితో వికాస్, బబ్లూలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ వికాస్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తర్వాతి కథనం
