సంబంధిత వార్తలు
- కర్నూలు జిల్లాలో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ
- ఒక్క నిమిషంలో ప్రశాంతంగా చంపేస్తుంది: స్విట్జర్లాండులో సూసైడ్ మెషీన్ సిద్ధం
- సీఎం కేసీఆర్ గారూ.. నా భర్తను ఎదుర్కొనేందుకు సిద్ధమేనా? కలెక్టర్‌పై జమున ఫైర్
- వ్యాపారంలో నష్టం : ఉరేసుకున్న భర్త - చెరువులో దూకిన భార్య
- పెళ్లయి 10 రోజులే... అత్తారింటికి వెళ్లాలన్న బెంగతో ఆత్మహత్య చేసుకుంది
మెదక్ జిల్లాల్లో విషాదం : సీఎంకు లేఖ రాసి రైతు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాల్లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకునేముందు ముఖ్యమంత్రికి లేఖ రాసిమరీ చనిపోయాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లాలోని హవేలి ఘనపూర్ మండలంలోని బొగడ భూపతిపూర్ గ్రామంలో ఓ యువరైతు ఉన్నాడు. ఈయన కుమారుడు అనారోగ్యంబారినపడ్డాడు. అతనికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు.
పైగా, ఆసరా పెన్షన్‌కు అర్హుడైన తన తండ్రికి పెన్షన్ రావడం లేదు. దీనికితోడు పండించిన వరి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయాడు.
ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఆత్మహత్యే శరణ్యమని భావించిన ఆ రైతు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి తన జేబులో పెట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తర్వాతి కథనం
