గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (19:40 IST)

ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం.. యువకుడి అరెస్ట్

romance
హైదరాబాదులో ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ప్రముఖ తెలుగు దర్శకుడు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
సురేష్ బోయిన 2017 నుంచి ప్రముఖ దర్శకుడు దగ్గర  పనిచేస్తున్నాడు. సినిమాల్లో అవకాశం ఇస్తామని సురేష్ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. 
 
అలాగే గోవా, బెంగళూరులోనూ సురేష్ వ్యభిచారం నిర్వహించారు. అమ్మాయిల ఫోటోలను ఆన్ లైన్‌లో పెట్టి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.