సంబంధిత వార్తలు
- ఆయుష్మాన్ భారత్లో తిరకాసువుంది : వైఎస్. షర్మిల
- అయ్యా .. కేసీఆర్ సారు.. ఇప్పటికే జనం తిరగ పడుతున్నరు: షర్మిల
- చంద్రబాబు మళ్లీ లేస్తడా, ఆ మంత్రులతో కలిసి ఏడ్చిన రోజులుండె: ఈటెల రాజేందర్
- కరోనా మృతులకు అన్నీ తామై అంత్యక్రియలు, హ్యాట్సాఫ్ ముస్లిం జెఎసి
- ఎట్టెట్టా... సరిహద్దులు మూస్తే కరోనా కట్టడి కాదా? కృతజ్ఞత లేని చంద్రం!
చంద్రబాబుకు హ్యాట్సాఫ్: వైఎస్ షర్మిళ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై పొగడ్తలతో ముంచెత్తారు జగన్ సోదరి షర్మిళ. తెలంగాణాలో జూడాలు చేస్తున్న సమ్మెను సమర్థించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి పూర్తిస్థాయిలో వేతనాలు ఎందుకు చెల్లించడంలేదని ప్రశ్నించారు.
తెలంగాణా రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిన నర్సులు విధులు నిర్వర్తిస్తుంటే వారిని ఉన్న ఫళంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వం భావిస్తోందని ఇది సరైన పద్ధతి కాదన్నారు. మొదట్లో ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు.
కెసిఆర్ నిర్ణయాలతో కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు నాశనమవుతున్నాయని... గతంలో రాష్ట్రం విడిపోక ముందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వడంతో పాటు బాగా పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేసిన సంధర్భాలు ఉన్నాయని.. ఆయన ముందు చూపుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు.
