1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Made a mistake by voting for the YCP: Balayya comments

ఓటేసి తప్పు చేసారు: బాలయ్య కామెంట్స్

Nandamuri Balakrishna
ఒక్క ఛాన్స్ అనగానే ఓటేసారు. తప్పు చేసారు అన్నారు బాలయ్య. హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు బాలకృష్ణ శనివారం పెమ్మసాని థియేటర్‌లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

 
అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి ప్రజలు తప్పు చేశారన్నారు. ఒకే ఒక్క ఛాన్స్ అంటే ఓటు వేసారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఇకనైనా ఆలోచించి ఓటు వేయండి. అప్పుడు ఎక్కడున్నాం... ఇప్పుడు ఎక్కడున్నాం ఆలోచించుకోవాలంటూ వైసిపిపై ఘాటు వ్యాఖ్యలు చేసారు.

 
బాలయ్య వ్యాఖ్యలపై మంత్రి ఆర్.కె రోజా మండిపడ్డారు. 14 ఏళ్ల టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా తన తండ్రి ఎన్టీఆర్‌ కోసం నిమ్మకూరు ముఖం చూడని బాలకృష్ణ ఇప్పుడు ఏదో చేస్తానని అంటున్నారు. నిమ్మకూరులో 30 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని, నిమ్మకూరును టూరిస్ట్‌ స్పాట్‌గా అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను సడన్‌గా బాలకృష్ణ చాటుకున్నారు.

 
ఇన్నాళ్లూ గుర్తు రాని ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు వచ్చారో అని ఎద్దేవా చేసారు. ఎన్టీఆర్ కు తగు గుర్తింపు ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అనీ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘనత ఆయనది అంటూ చెప్పారు రోజా. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఎన్టీఆర్ మరణానికి కారకులైనవారే ఆయన విగ్రహానికి దండలు వేసి పొగుడుతున్నారు: బాబుపై రోజా ఫైర్