కరెంట్ షాక్ కొడితే అందరూ చేసే తప్పులు ఇవే!
కరెంట్ షాక్ కొడితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.కనీసం ఇలా చేసిన చాలు ప్రాణాలతో బయటపడతారు...
►కరెంట్ షాక్‌కు గురైన వ్యక్తిని ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతున్న వైర్‌నుంచి వేరు చేయాలి.
►షాక్‌కు గురైన వ్యక్తి స్పృహ కోల్పోకుండా ఉంటే స్థిమితపడేందుకు అవసరమైన ధైర్యం చెప్పాలి.
►ఒకవేళ పేషెంట్ అపస్మారక స్థితిలో ఉంటే పల్స్ చూడాలి. పల్స్ అందకుండా ఉంటే సీపీఆర్ చేయాలి. అంటే... శ్వాస ఆగిపోతే నోటి ద్వారా కాస్త ఒత్తిడితో గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపాలి. గుండె స్పందనలు ఆగిపోతే కనీసం రెండు అంగుళాలలోతుగా ప్రభావం పడేట్లుగా ఛాతీపైన చేతులు ఉంచి ప్రెషర్ ఇవ్వాలి. ఈ రెండూ చేస్తూ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించాలి.
►ఎలక్ట్రిక్ షాక్ వల్ల కాలిన గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. వాటిని ఎలక్ట్రిక్ బర్న్ అంటారు. వాటికి ఆయింట్‌మెంట్స్‌గాని, పూతమందులు గాని రాయకూడదు.
►విద్యుద్ఘాతానికి గురైన వారు సాధారణంగా ఎత్తునుంచి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అకస్మాత్తుగా కదిలించకూడదు. గాయాలను బట్టి ప్రథమ చికిత్స చేయాలి.
►షాక్‌కు గురైన వారి గుండె స్పందనల్లో తేడా రావచ్చు. దాన్ని వెంట్రిక్యులార్ అరిథ్మియా అంటారు. దాన్ని మానిటర్ ద్వారానే గుర్తించగలం కాబట్టి వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలి.