వేడినీటిలో ఒక స్పూన్ తేనె, దాల్చినచెక్క పొడి వేసి....
తేనెలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్స్, విటమిన్స్ వుంటాయి. కాల్షియమ్, కాపర్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్, పొటాసియమ్, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, బి, సి, డి తగినంత వున్నాయి. రైబో ఫ్లేవిన్, నియాసిన్‌లు తేనెలో లభిస్తాయి.
తేనెను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కీళ్ళనొప్పులు బాదిస్తుంటే ఒక వంతు తేనె, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చినచెక్క పొడి తీసుకోండి. ఆ మిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధించే భాగం మీద మర్దనచేస్తే మర్దన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.
రెండు స్పూన్లతేనెలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలగి, జీర్ణం సులభం చేస్తుంది. తేనె, దాల్చినచెక్కపొడిని బ్రెడ్ మీద పరుచుకుని ఆహారం తింటే కొలెస్టరాల్ తగ్గుతుంది. దీన్నే రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్ రానివ్వదు.
వేడినీటిలో ఒక స్పూన్ తేనె, దాల్చినచెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయమవుతుంది. గజ్జి, తామర వంటి చర్మ రోగాలకు తేనె, దాల్చిన చెక్కల మిశ్రమమే దివ్య ఔషధం.