శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (21:44 IST)

రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ పని చేసి చూడండి...

రాత్రిపూట నిద్రపోయే ముందు తేనెను కలిపిన వేడినీటితో పుక్కిలించుకుంటే దంత సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా బ్యాక్టీరియా నశించి, ఎనామల్ రక్షించబడుతుంది.
 
అలాగే పచ్చిఅరటిపండుతో పేగు వ్యాధులకు, నోటి పూతకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పేగుల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ద్వారా ఏర్పడే అల్సర్‌కు చెక్ పెట్టాలంటే అరటిపండు తినాల్సిందేనని వారు చెబుతున్నారు. 
 
అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే బెండకాయ, బార్లీ గింజల గంజిని మూడువేళలా తాగితే సరిపోతుంది. అన్నం తినడానికి అరగంట ముందు అర స్పూన్ ఆలివ్ అయిల్ తీసుకుంటే రక్త నాళాల్లో కొవ్వు శాతం క్రమంగా తగ్గిపోతుంది. 
 
అలాగే నోటి పూతతో ఇబ్బందిపడుతున్న వారు పచ్చి అరటిపండును తీసుకుంటూ వుండాలి. అలాగే కారాన్ని అధికంగా తీసుకోకూడదు. పెరుగు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ అప్పుడప్పుడూ తీసుకోవాలి.