1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (15:59 IST)

అక్షయ తృతీయ రోజున వెల్లుల్లి, ఉల్లి తినకూడదట..

 Akshaya Tritiya 2022
అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఏ మూలన చీకటి పడకుండా చూసుకోవాలి. ఇంట్లో చీకటి ఉన్న చోట దీపం వెలిగించాలి. ఇది కాకుండా తులసి మొక్క, లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి.
 
అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. ఈ రోజు ప్రతీకార విషయాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానుకోవాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఎవరి పట్లా చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకూడదు. 
 
అక్షయ తృతీయ రోజున, కొంతమందికి తెలియకుండా కేవలం లక్ష్మిదేవిని మాత్రమే పూజిస్తారు. అయితే లక్ష్మీదేవిని విష్ణువుతో కలిపి పూజించాలి. ఇద్దరినీ విడివిడిగా పూజించడం వల్ల అశుభ ఫలితాలు ఉంటాయి. విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.