1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Very Rare Red Snake Spotted In Uttar Pradesh. Beautiful, Says Twitter

అందమైన ఎరుపు రంగు పాము.. మెరిసిపోతున్న శరీరంతో.. ఫోటోలు వైరల్

Very Rare Red Snake
Red Coral Kukri snake
వర్షాకాలం కావడంతో అడవుల్లో వుండే పాములు జననివాసంలోకి వస్తున్నాయి. తాజాగా యూపీలో అరుదైన పాము కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని దుధ్వా నేషనల్ పార్క్‌లో ఎంతో అరుదైన పామును గుర్తించారు. ఈ పాము ప్రత్యేకత ఏంటంటే? అందంగా వుండటమే.

ఈ పాము చాలా అందమైన అరుదైన పాముగా అధికారులు చెప్తున్నారు. ఈ తరహా పామును ఇదే ప్రాంతంలో 1936లో తొలిసారిగా చూశారు. తాజాగా, వర్షం కురిసిన అనంతరం సిబ్బంది నివాస గృహాల వద్ద ఈ పాము దర్శనమిచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్షింపూర్ ఖేరీలో ఉన్న అభయారణ్యంలో రెండ్రోజుల క్రితం ఈ పాము అటవీ సిబ్బంది కంటబడింది. మెరిసిపోతున్న శరీరంతో, ఎంతో అందంగా ఉన్న ఆ పామును ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ పామును ''రెడ్ కోరల్ కుక్రీ'' అంటారని వన్యప్రాణి నిపుణులు తెలిపారు. దీని శాస్త్రీయనామం 'ఒలిగోడోన్ ఖెరినెన్సిస్' అని వారు చెప్తున్నారు. 
తర్వాతి కథనం
రేపు విజయవాడ హైవేలో ట్రాఫిక్ మళ్లింపు... గమనించగలరు