సంబంధిత వార్తలు
- సోల్డ్ ఏపీగా జగన్ పాలన: తెలుగుదేశం పార్టీ
- స్వదేశీ - విదేశీ వస్తువులను వేర్వేరు ర్యాకుల్లో ఉంచాలి : ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
- కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని రకాల అనుమతులు: జగన్
- ఏపీలో కారులో ముగ్గురు.. పెళ్లిళ్లకు 50 మందికి మాత్రమే అనుమతి
- జూన్‌లో ఏపీ పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్?
ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విరాళాల వెల్లువ
కరోనా మహమ్మారి నివారణకు, లాక్‌డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు గానూ సీఎంఆర్ఎఫ్‌కు సోమవారం భారీగా విరాళాలు అందాయి. కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ట్రైమెక్స్ గ్రూప్ కంపెనీ రూ.2 కోట్లు విరాళం ప్రకటించింది.
దీనికి సంబంధించిన చెక్కును సీఎం జగన్‌కు ట్రైమెక్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రదీప్ కోనేరు అందజేశారు. అలాగే తోపుదుర్తి మహిళ సహకార డైరీ, రాప్తాడు నియోజకవర్గ పారిశ్రామికవేత్తలు, నేతలు సంయుక్తంగా ఇచ్చిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, వేదవ్యాస్, రాజశేఖర్ రెడ్డి, హరిప్రసాద్ చౌదరి కలిసి సీఎం జగన్‌కు అందజేశారు.
అదేవిధంగా పల్సన్ గ్రూప్ రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును పల్సన్ గ్రూప్ సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు.. సీఎం జగన్‌కు అందజేశారు.
తర్వాతి కథనం
