శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 మే 2020 (16:31 IST)

జూన్‌లో ఏపీ పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌?

కరోనా కల్లోలాన్ని తట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా తొలిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ సమావేశాలను నిర్వహిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

మార్చిలో నిర్వహించాల్సిన బడ్జెట్‌ సమావేశాల కరోనా వైరస్‌ కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. సమావేశాలను మూడు నెలల పాటు వాయిదా వేసిన ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ ద్వారా మూడు నెలల బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ ద్వారా ఆమోదం పొందింది. ఈ గడువు కూడా జూన్‌ 30తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు శాసనసభ నుండి ఆమోదం పొందాలని బావిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. జూన్‌లోగా కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ వైరస్‌ ఉధృతి తగ్గకపోయినా అవసరమైన జాగ్రత్తలతో జూన్‌లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభత్వుం భావిస్తున్నట్లు సమాచారం.

అయితే, శాసన మండలిని రద్దు చేయాలని శాసనసభ తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. ఇదే వైఖరితో కేంద్రం ఉంటే, మండలిని కూడా సమావేశపరచాల్సి ఉంటుంది. మరోవైపు సిఆర్‌డిఎ రద్దు బిల్లును శాసనసభ ఆమోదించినా, మండలి తిరస్కరించడంతో సెలక్ట్‌ కమిటీకి పంపింది.