ఏపీలో విద్యుత్ చార్జీల భారం.. సీఎంకు థ్యాంక్స్ చెప్పిన హోంమంత్రి

sucharitha
ఎం| Last Updated: గురువారం, 14 మే 2020 (17:51 IST)
విద్యుత్ చార్జీల బాదుడుతో ఏపీ జనం గగ్గోలు పెడుతుంటే ఈ విధానం బావుందంటూ హోంమంత్రిఏకంగా సీఎంకి ధన్యవాదాలు తెలిపారు.
సర్ చార్జీలు, రీ కనెక్షన్ చార్జీలు లేకుండా చేశారంటూ కృతజ్ఞతలు తెలిపారు.

గురువారం విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన హోంమంత్రి మేకతోటి సుచరిత విలేఖరులతో మాట్లాడుతూ.... "మార్చ్ నెల పవర్ బిల్ ను గతంలో ఏ విధంగా చేశారో అదే విధానాన్ని అనుసరించారు. ఏప్రిల్ నెల బిల్ లో మాత్రం డైనమిక్ బిల్లింగ్ విధానాన్ని అనుసరించారు.

దీని వలన వినియోగదారుడికి మంచే జరుగుతుంది. గతంలో
స్లాబ్ యూనిట్ ప్రకారం బిల్స్ వచ్చేవి. ఇప్పుడు మాత్రం విద్యుత్ ఎంత ఉపయోగిస్తే అంతకు మాత్రమే బిల్ వస్తున్నాయి. ఈ విధానం వినియోగదారులకు మంచిదనే విషయాన్ని ప్రజలు గమనించాలి.

ఏ నెలలో ఎంత వినియోగం చేస్తారో అంతకు మాత్రమే బిల్ వస్తుంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీని వలన విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవి కాలం కారణంగా ప్రతి ఇంట్లో ఏసీ లు, కూలర్లు, ఫ్రిడ్జ్, ఫ్యాన్, టీవీ ల వాడకం బాగా పెరిగింది.

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా విద్యుత్ శాఖ పవర్ కట్ కాకుండా బాగా పనిచేసింది. లాక్ డౌన్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రజలకు వెసలుబాటు కల్పించింది. బిల్ లు చెల్లించలేని వారికి జూన్ నెల 30 వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.

సర్ చార్జీలు, రీ కనెక్షన్ చార్జీలు కూడా లేకుండా చేసిన సీఎంకి హోంమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు" అని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆమె నిజంగా ధన్యవాదాలు తెలిపారా? లేక వ్యంగ వ్యాఖ్యలు చేశారా అని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.దీనిపై మరింత చదవండి :