బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (21:34 IST)

'బిజెపి విడ్మెడ్ టెలీ‌మెడిసిన్ యాప్' ప్రారంభం

భాజపా రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ "విడ్మెడ్ యాప్" ప్రారంభించారు. రాష్ట్ర  డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను  ఆయ‌న ప్రారంభించారు.

ముందుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులు, డాక్టర్స్ ఈ యాప్ యొక్క విధి విధానాలపై చర్చించారు. వీరిలో భాజపా కోర్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్  సహా ఇంచార్జి సునీల్ దేయోదర్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పివిఎన్ మాధవ్, మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, సేనక్కాయల అరుణ, రావెల కిషోర్‌బాబు, మాణిక్యాలరావు, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఎన్.మధుకర్ పాల్గొన్నారు.

డాక్టర్స్ విభాగం నుండి డాక్టర్ ఎన్టీఆర్  హెల్త్ యూనివర్సిటీ మాజీ ఉప కులపతులు డా.ఐ.వి.రావు, డా.సి.వి.రావు, డా.రవిరాజు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత డా.సి.ఎల్. వెంకటరావు వహించారు. ఈ సంద‌ర్భ‌ఢంగా జూమ్ యాప్ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని కన్నా మీడియాకు వివరిస్తూ ప్రయాణ పరిమితుల వల్ల బాధపడుతున్న వేలాది మందికి ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌తో వైద్య సంప్రదింపులు జరపడానికి బిజెపి హెల్త్ వింగ్ “బిజెపి విడ్మెడ్” యాప్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

అనేక ఆస్పత్రులు మరియు వైద్యులు వ్యక్తిగతంగా ఓపీడీ సేవలను అందించనందున, బయటకు వెళ్లి వైద్య సహాయం కోరేందుకు బాధపడుతున్న కోవిడ్ మరియు నాన్ కోవిడ్ రోగులకు బిజెపి విడ్మెడ్ సహాయం చేస్తుంది. 
 
బిజెపి విడ్మెడ్ వృద్ధులకు, మహిళలకు వరం మరియు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇంటర్నెట్ ద్వారా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, తమను తాము నమోదు చేసుకోవచ్చు  అని మరియు ఈ యాప్ ద్వారా వైద్యుడిని సంప్రదింవచ్చునని రోగులు, మెడికల్ డాక్టర్ లేదా స్పెషలిస్ట్‌తో వీడియో సంప్రదింపుల కోసం మరియు ప్రయోగశాల మరియు ఫార్మసీ సేవలకు కూడా ఇంటర్నెట్ ద్వారా ఉపయోగించవచ్చు.

ఈ యాప్ కు గత మార్చి 25 2020 న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జాతీయ ఆరోగ్య మండలి) ఆమోదం తెలిపింది అని తద్వారానే ఈ అంశాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు భాజాపా ప్రారంభించింద‌ని దీని ద్వారా డాక్టర్ పేషేంట్ కు పరీక్షల సలహాలు ఇవ్వడమే కాకుండా మన రిపోర్ట్స్ కూడా పంపి  నిర్ధారణ అనంతరం ఫోన్ నెంబర్‌కు డాక్టర్ సూచించిన మందుల జాబితా వస్తుందని పేర్కొన్నారు.

దీనిని స్థానికంగా ఉన్న మందుల షాపుల్లోనూ అనుమతిస్తామ‌ని చెప్పారు. ఆరోగ్యసేతు యాప్‌కు ఏవిధమైన ప్రాచుర్యం లభించిందో అదేవిదంగా ఈ యాప్‌ను ముందుకు తీసుకెళ్లాలని కన్నా కోరారు.

విడ్మెడ్ సేవను ఉపయోగించడానికి ఇంటర్నెట్ వినియోగదారుకు సహాయం అవసరమైనప్పుడు, టోల్-ఫ్రీ నంబర్ మరియు లైవ్ హెల్ప్‌డెస్క్ ఉన్నాయి, వారు సేవలను సమర్థవంతంగా పొందడంలో వినియోగదారులకు సహాయపడతారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.