శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (12:30 IST)

మా కుటుంబానికి ఒక చరిత్ర వుంది.. బీజేపీలో చేరను: జేసీ

బీజేపీలో చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ హయాం నుంచి బీజేపీలో చేరాలని తమ కుటుంబానికి ఆ పార్టీ పెద్దల నుంచి ఆహ్వానం వచ్చిందని, గతంలో బీజేపీ అధ్యక్షుడు జేసీ నడ్డా నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకూ తనను బీజేపీలో చేరాలని సలహాలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు జేసీ.

అలాగే గతంలో కూడా నడ్డా ఎన్నో సార్లు తనను బీజేపీలోకి ఆహ్వానించారని.. కానీ సున్నితంగా తిరస్కరించానన్నారు. తమకుటుంబం గౌరవం గురించి ఆలోచిస్తున్నట్లు జేసీ పేర్కొన్నారు.

రాష్ట్రంలో తమకంటూ ఒక చరిత్ర ఉందని.. తాము తొందరపడి నిర్ణయాలు తీసుకోమన్నారు. తన స్వార్థం కంటే.. కుటుంబ చరిత్రను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటానన్నారు. ఇక సొంత నియోజకవర్గమైన తాడిపత్రి ఎమ్మెల్యే పాలన బావుందని, ఆయన ఎంతో కష్టి చేస్తున్నారని కామెంట్స్ చేశారు.

అలాగే కరోనా గురించి కూడా జేసీ మాట్లాడారు. ఇది మన రాష్ట్రానికే పరిమితం కాలేదని.. ప్రపంచం మొత్తం వ్యాపించిందని.. కాబట్టి దయచేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఏపీలో తక్కువ కేసులు ఉన్నాయని సంబరపడొద్దని.. చాలా అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఇటీవల.. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జుటూరులోని జేసీ దివాకర్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో వీరు కలిశారు. సుమారు నాలుగు గంటల పాటు వీరు ముగ్గురూ చర్చించుకున్నారు.

సుమారు నాలుగు గంటల పాటు వీరు ముగ్గురూ చర్చించుకున్నారు. ఈ భేటీ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి.. బీజేపీలో చేరతారని ముమ్మురంగా ప్రచారం జరిగింది.