శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (21:10 IST)

#బండి సంజయ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియామకం

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నియామకమయ్యారు. యువతలో గట్టిపట్టున్న బండి సంజయ్‌కు బీజేపీ అధిష్టానంతో పాటూ ఆర్ఎస్ఎస్‌తోనూ సత్సంబంధాలున్నాయి.

2018 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు.

మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్ తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ అంతటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.